శుక్రవారం 22 జనవరి 2021
International - Jan 07, 2021 , 10:01:14

ట్రంప్ ఎఫ్‌బీ, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టా అకౌంట్లు బ్లాక్‌

ట్రంప్ ఎఫ్‌బీ, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టా అకౌంట్లు బ్లాక్‌

శాన్‌ఫ్రాన్సిస్‌కో:  అమెరికా కొత్త అధ్య‌క్షుడిగా జో బైడెన్‌ ఎన్నిక‌ను అడ్డుకుంటూ.. వాషింగ్ట‌న్‌లోని క్యాపిట‌ల్ హిల్‌లోకి ట్రంప్ నిర‌స‌న‌కారులు దూసుకెళ్లి విధ్వంసం సృష్టించిన విష‌యం తెలిసిందే.  అయితే క్యాపిట‌ల్ హిల్‌లో హింస‌కు దారి తీసే విధంగే ట్రంప్ రెచ్చ‌గొట్టిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియా సంస్థ‌లు.. ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు ట్రంప్ అకౌంట్‌ను బ్లాక్ చేసిన‌ట్లు ప్ర‌క‌టించాయి. ఇటీవ‌ల జ‌రిగిన అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో భారీ అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు ట్రంప్ ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల్లో మోసం జ‌రిగిన‌ట్లు ట్రంప్ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేయ‌డంతో క్యాపిట‌ల్ హిల్‌కు భారీ సంఖ్యలో ఆయ‌న మ‌ద్ద‌తుదారులు వ‌చ్చారు.  ఈ కార‌ణంగానే ట్రంప్ సోష‌ల్ మీడియా అకౌంట్ల‌ను సీజ్ చేస్తున్న‌ట్లు ఆయా సంస్థ‌లు వెల్ల‌డించాయి.  ఇది ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితి అని, అవ‌స‌ర‌మైన ఎమ‌ర్జెన్సీ చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, అధ్య‌క్షుడు ట్రంప్ వీడియోను కూడా డిలీట్ చేస్తున్న‌ట్లు ఫేస్‌బుక్ అధ్య‌క్షుడు గ‌య్ రోస‌న్ తెలిపారు.

ప్ర‌స్తుతం హింస‌ను త‌గ్గించేందుకు ఆ చ‌ర్య చేప‌ట్టిన‌ట్లు ఫేస్‌బుక్ తెలిపింది.  24 గంట‌ల పాటు ట్రంప్‌పై నిషేధం విధిస్తున్న‌ట్లు ఫేస్‌బుక్ సంస్థ చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్ స‌ర్వీసును కూడా నిలిపివేశారు. ట్రంప్ చేసిన మెసేజ్‌లు హింస‌ను ప్రేరేపిస్తున్న‌ట్లు ఇన్‌స్టా ఆరోపించింది. ఫేస్‌బుక్‌ త‌న లేబుల్‌లో కూడా మార్పు చేసింది. తాజాగా ముగిసిన ఎన్నిక‌ల్లో జో బైడెన్ గెలిచిన 50 రాష్ట్రాలు అంగీక‌రించాయ‌ని ఫేస్‌బుక్ త‌న పేజీలో పెట్టింది.  శాంతియుతంగా అధికార బ‌దిలీ జ‌రిగేందుకు అమెరికాలో చ‌ట్టాలు, విధానాలు, వ్య‌వ‌స్థలు ఉన్న‌ట్లు ఆ పోస్టులో ఎఫ్‌బీ తెలిపింది.  


logo