గురువారం 28 మే 2020
International - Apr 29, 2020 , 13:53:07

ఫేస్‌బుక్‌లో కొత్త ఇమోజీలు‌..

ఫేస్‌బుక్‌లో కొత్త ఇమోజీలు‌..

క‌రోనా మహమ్మారి భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్న నేప‌థ్యంలో దాని నివార‌ణ‌కు అత్య‌వ‌స‌ర సిబ్బంది విధుల్లో ఉన్నారు. వారిప‌ట్ల నెటిజ‌న్లు సంఘీభావం తెలియ‌జేస్తున్నారు. అట్లాగే ఆప్తుల ఆరోగ్యం ప‌ట్ల స్పంద‌న‌ను తెలియ జేస్తున్నారు. జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరుకుంటున్నారు. అయితే  గ‌త కొంతకాలంగా వీటి గురించే సోష‌ల్ మీడియాలో ఎక్కువ నెటిజ‌న్లు మాట్లాడుకోవ‌డంతో వీటికోసం ప్ర‌త్యేకంగా రెండు రియాక్ష‌న్‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది ఫేస్‌బుక్‌. పోస్టు రియాక్ష‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఏడు రియాక్ష‌న్ల‌తో పాటు ఇప్పుడు'కేర్'  అనే హృద‌యాన్ని ప‌ట్టుకున్న ఎమోజీ యాడ్ అయింది. దీంతో పాటు మెసెంజ‌ర్ లోనూ హృద‌యాకార‌ ఎమోజీని యాడ్‌చేసింది ఆ కంపెనీ. అయితే ఇటీవ‌లే వీటి గురించి ప్ర‌క‌టించిన ఫేస్‌బుక్  తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఫేస్‌బుక్ యాప్‌ను అప్‌డేట్ చేసుకుంటే వీటిని వినియోగించుకోవ‌చ్చు.


logo