గురువారం 09 జూలై 2020
International - Jun 15, 2020 , 17:48:43

ఆస్ట్రేలియా డిమాండ్‌ను తిరస్కరించిన ఫేస్‌బుక్‌

ఆస్ట్రేలియా డిమాండ్‌ను తిరస్కరించిన ఫేస్‌బుక్‌

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌ సం‍స్థకు మీడియా ప్రకటనల ద్వారా వచ్చే లాభాల్లో కొంత చెల్లించాలన్న ఆస్ట్రేలియా ప్రభుత్వ డిమాండ్‌ను ఫేస్‌బుక్‌ తిరస్కరించింది. అయితే, మీడియా ద్వారా సేకరిస్తున్న సమాచారంతో వాణిజ్యపరంగా తమకు ఎలాంటి ఉపయోగం లేదని తెలిపింది. అవసరమైతే మీడియా సమాచారాన్ని ఫేస్‌బుక్‌ ఫ్లాట్‌ఫార్మ్‌లో ఉపయోగించమని చెప్పింది. అయితే గూగుల్‌, ఫేస్‌బుక్‌ లాంటి సంస్థలు మీడియా సమాచారాన్ని ఉపయోగించినందుకు ప్రకటనల ద్వారా వచ్చే లాభాల్లో కొంత మీడియాకు చెల్లించే విధంగా కృషి చేయాలని ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ (ఏసీసీసీ)ను ప్రభుత్వం ఆదేశించింది.  ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌, గూగుల్‌కు ఉన్న బ్రాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, కొంత కాలంగా ఆన్‌లైన్‌ ప్రకటనల ద్వారా మీడియా సమాచారాన్ని వాడుకొని ఫేస్‌బుక్‌ సంస్థ లాభాలను అర్జిస్తుందని ఇటీవల రూపెర్ట్ ముర్డోచ్, న్యూస్ కార్ప్ సంస్థలు ఆరోపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా సంక్షోభంలో పత్రికా రంగాన్ని కాపాడేందుకు.. వాటికి వచ్చే నష్టాలను అధ్యయనం చేసి, పరిష్కారం  చూపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.


logo