శనివారం 30 మే 2020
International - Apr 08, 2020 , 01:04:47

కరోనా పోరాటంలో ఫేస్‌బుక్‌!

కరోనా పోరాటంలో ఫేస్‌బుక్‌!

శాన్‌ఫ్రాన్సిస్కో: కరోనాపై పోరాటంలో వైద్యులు, అధికారులకు సహకారాన్ని అందించేందుకు ఫేస్‌బుక్‌ ముందుకొచ్చింది. వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల సమాచారాన్నిమ్యాపుల రూపంలో ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఇందుకోసం తన ఖాతాదారుల కదలికల సమాచారం, విదేశాల్లోని బంధువులు, మిత్రులతో వాళ్లు ఎక్కడెక్కడ కలుసుకున్నారన్న వివరాల్ని మ్యాపుల రూపంలో అందించనున్నట్టు వెల్లడించింది. దీంతో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలు తెలుస్తాయని పేర్కొంది.


logo