ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Aug 06, 2020 , 10:33:29

ట్రంప్ పోస్టును డిలీట్ చేసిన ఫేస్‌బుక్‌

ట్రంప్ పోస్టును డిలీట్ చేసిన ఫేస్‌బుక్‌

హైద‌రాబాద్‌: చిన్నారుల్లో కోవిడ్ రోగ‌నిరోధ‌క‌శ‌క్తి ఉన్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ఓ పోస్టును సోష‌ల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ డిలీట్ చేసింది.  నోవెల్ క‌రోనా వైర‌స్ ప‌ట్ల త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతుంద‌న్న కార‌ణంతో ఫేస్‌బుక్ సంస్థ ఆ పోస్టును డిలీట్ చేసింది.  ఆ పోస్టు తమ విధానాల‌ను ఉల్లంఘించిన‌ట్లు ఉంద‌ని పేర్కొన్న‌ది. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ట్రంప్ త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు.  కోవిడ్ వ్యాధి పిల్ల‌ల‌కు సోక‌ద‌న్న ఓ అభిప్రాయాన్ని ఆయ‌న ఆ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. ఆ కామెంట్ ఉన్న పోస్టును ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. అయితే ఆ పోస్టును డిలీట్ చేసిన‌ట్లు ఫేస్‌బుక్ విధాన ప్ర‌తినిధి ఓ ప్ర‌క‌ట‌న‌లో చెప్పారు.   


logo