సోమవారం 19 అక్టోబర్ 2020
International - Sep 23, 2020 , 19:28:45

చైనాకు చెందిన అకౌంట్లను డెలీట్ చేసిన ఫేస్‌బుక్‌

 చైనాకు చెందిన అకౌంట్లను డెలీట్ చేసిన ఫేస్‌బుక్‌

ఢిల్లీ : ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ చైనాకు చెందిన ఖాతాలను ఏరేసేపనిలో పడింది. నకిలీ ఖాతాలు, ఫేస్‌బుక్‌ పేజీలు ఉన్న నెట్‌వర్క్‌ను‌ తొలగించింది. అమెరికా సహా పలు దేశాల్లోని రాజకీయ కార్యకలాపాలను ఇబ్బందిపెట్టేలా  ఆ ఖాతాలు ఉన్నాయని ఫేస్‌బుక్‌ తెలిపింది. ఆగ్నేయాసియా, ఫిలిప్పీన్స్‌ దేశాల రాజకీయాలపైనే ప్రధానంగా ఈ నెట్‌వర్క్‌ దృష్టి సారించినట్లు పేర్కొన్నది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రాట్ల అభ్యర్థి జోబైడెన్‌లకు వ్యతిరేకంగా, మద్దతుగా ఈ ఖాతాల్లో పోస్టులు చేసినట్లు పేర్కొంది.

చైనా ప్రభుత్వంతో ఈ నెట్‌వర్క్‌కు సంబంధాలు ఉన్నాయా లేదా అనే విషయం ఫేస్‌బుక్‌ వెల్లడించలేదు. ప్రైవేటు నెట్‌వర్క్‌లు, ఇతర పద్ధతుల ద్వారా ఈ ఖాతాలను నిర్వహించిన వ్యక్తులు తమ వివరాలను దాచినట్లు తెలిపింది. మరోవైపు విదేశాలకు చెందిన వ్యక్తులు, సైబర్‌ నేరగాళ్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేందుకు, ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ఎఫ్‌బీఐ సహా హోంలైన్‌ సెక్యూరిటీస్‌ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


logo