బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Sep 02, 2020 , 13:57:44

అమెజాన్‌కు డ్రోన్ల డెలివరీ కోసం అనుమతులు ఇచ్చిన ఎఫ్ఏఏ

 అమెజాన్‌కు డ్రోన్ల డెలివరీ కోసం అనుమతులు ఇచ్చిన ఎఫ్ఏఏ

వాషింగ్ టన్ : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ వినియోగదారులకు సరికొత్త సేవలందించేందుకు సిద్ధమైంది. కొనుగోలుదారులకు వేగంగా ఆర్డర్లను డెలివరీ చేయడానికి రెడీ వినూత్నమార్గాన్ని ఎంచుకున్నది. ప్రొడక్ట్‌ను ఆర్డర్ చేసిన 30 నిమిషాల్లోనే హోమ్ డెలివరీ చేయనున్నది. దీని కోసం కంపెనీ కొత్త సర్వీసులు లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నది. అమెజాన్ డ్రోన్ల సాయంతో కస్టమర్లకు ప్రొడక్టులను డెలివరీ చేయనుంది. అమెజాన్ కంపెనీకి డ్రోన్ల ద్వారా డెలివరీ చేయడానికి అనుమతులు లభించాయి. అమెరికాలో... యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) తాజాగా అమెజాన్‌కు డ్రోన్ల డెలివరీ కోసం అనుమతులు ఇచ్చింది.

ప్రస్తుతం అమెజాన్ డ్రోన్ ఫ్లైట్ ద్వారా డెలివరీ ట్రైయల్స్ వేస్తున్నది. అయితే కంపెనీ ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో కస్టమర్లకు డ్రోన్ల ద్వారా డెలివరీ సర్వీసులను ప్రారంభిస్తుందనేది  త్వరలోనే వెల్లడించనున్నది. 2013 నుంచే తాము డ్రోన్ల డెలివరీ అంశంపై పనిచేస్తున్నామని అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్ బెజోస్ ఇటీవల ప్రకటించారు. అమెజాన్ పార్ట్ 135 సంస్థ ఎయిర్ కెరియర్ సర్టిఫికెట్ కూడా పొందింది. అంటే దీని వల్ల కంపెనీ ప్రైమ్ ఎయిర్ డ్రోన్లను ఉపయోగించొచ్చు. డ్రోన్ల డెలివరీ సేవలు అందుబాటులోకి వస్తే..ఆర్డర్ చేసిన ఉత్పత్తులను వేగంగా డెలివరీ చేసేందుకు వీలుకలుగనున్నది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo