ఇది అత్యంత అరుదైన జాతికి చెందిన అక్టోపస్. దీని ఆకారాన్ని బట్టి బ్లాంకెట్ అక్టోపస్ అని పిలుస్తారు. సముద్రం అడుగుభాగంలోనే ఎక్కువగా ఉంటుంది. పైకి రావడం చాలా తక్కువ. గ్రేట్ బ్యారియర్ రీఫ్లోని లేడీ ఇలియట్ దీవుల్లో సముద్ర జీవ శాస్త్రవేత్త జసింటా షెకిల్టాన్ ఇటీవల దీన్ని గుర్తించారు. ఆయన వెంటనే వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. బ్లాంకెట్ అక్టోపస్ చివరిసారి గ్రేట్ బ్యారియర్ రీఫ్లోనే 21 ఏండ్ల క్రితం కనిపించింది.