గురువారం 26 నవంబర్ 2020
International - Nov 07, 2020 , 17:12:14

జపాన్‌ తీరంలో తీవ్ర భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.2గా నమోదు

జపాన్‌ తీరంలో తీవ్ర భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.2గా నమోదు

టోక్యో : జపాన్‌ రాజధాని టోక్యోకు ఆగ్నేయంగా 600 కిలోమీటర్ల దూరంలోని ఒగాసవరా ద్వీపంలోని చిచిజిమా తీరాన్ని శనివారం ఉదయం తీవ్ర భూకంపం వణికించింది. రిక్టర్‌ స్కేల్‌పై ప్రకంపనల తీవ్రత 6.2గా నమోదైనట్లు జపాన్‌ వాతావరణ సంస్థ తెలిపింది. సముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నిక్షిప్తమైనట్లు పేర్కొంది. ఇప్పటివరకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. భూప్రకంప కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు. జపాన్‌ భూకంప క్రియాశీలక జోన్‌లో ఉంది. ఇక్కడ తరచూ శక్తివంతమైన భూకంపాలు సంభవించడం పరిపాటి. 2011లో 9.0 తీవ్రతతో భూకంపం రావడంతో సునామీ, ఫుకుషిమా అణు విద్యుత్‌ కేంద్రంలో విపత్తు సంభవించి సుమారు 15 వేలమందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.