e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home News కొత్త ట్విస్ట్‌.. ఇజ్రాయెల్‌లో బ‌య‌ట‌ప‌డ్డ మిస్ట‌రీ మాన‌వ జాతి

కొత్త ట్విస్ట్‌.. ఇజ్రాయెల్‌లో బ‌య‌ట‌ప‌డ్డ మిస్ట‌రీ మాన‌వ జాతి

కొత్త ట్విస్ట్‌.. ఇజ్రాయెల్‌లో బ‌య‌ట‌ప‌డ్డ మిస్ట‌రీ మాన‌వ జాతి

జెరుస‌లెం: మ‌నిషి కోతి నుంచి పుట్టాడ‌న్న‌ది చార్లెస్ డార్విన్ చెబుతున్న జీవ ప‌రిణామ సిద్ధాంతం. అందులోనూ ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌న‌కు తెలిసింది రెండు జాతులే. యూర‌ప్‌లో నివ‌సించిన నియాండ‌ర్త‌ల్స్‌, ఆఫ్రికాలో ఉన్న హోమో సేపియ‌న్స్‌. కానీ ఈ రెండు జాతుల‌కు చెంద‌ని ఓ కొత్త మిస్ట‌రీ మానవ జాతిని తాజాగా ఇజ్రాయెల్‌లో క‌నుగొన్నారు. అక్క‌డి నెషెర్ రామ్లాలో త‌వ్వ‌కాలు జ‌ర‌ప‌గా.. కొన్ని ఎముక‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇవి ల‌క్ష ఏళ్ల కింద‌టి అంత‌రించిపోయిన మాన‌వ జాతివని తేల్చారు.

ఈ ఎముక‌లు విల‌క్ష‌ణంగా ఉన్నాయి. అదే స‌మ‌యంలో నివ‌సించిన‌ నియాండ‌ర్త‌ల్స్‌, హోమో సేపియ‌న్స్ ల‌క్ష‌ణాలు వీటిలో క‌నిపించాయి. ఈ ఎముక‌ల‌తోపాటు రాతి సాధ‌నాలు, గుర్రం, జింక‌, ఎద్దుల ఎముక‌లు కూడా ఈ త‌వ్వ‌కాల్లో బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ త‌వ్వ‌కాల గురించి అధ్య‌య‌నాల‌ను సైన్స్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు. వీళ్లు త‌మకు ద‌గ్గ‌ర‌లో ఉన్న హోమో సేపియ‌న్స్‌తో త‌మ సంస్కృతిని, జ‌న్యువుల‌ను పంచుకున్న‌ట్లు ప‌రిశోధ‌కులు వివ‌రించారు. ఆఫ్రికా, యూరేసియా క్రాస్‌రోడ్స్‌లో బ‌య‌ట‌ప‌డిన ఈ మాన‌వ జాతి అవశేషాలు ఓ కొత్త ప్ర‌శ్న లేవ‌నెత్తుతున్నాయ‌ని ఈ అధ్య‌య‌నం అభిప్రాయ‌ప‌డింది.

- Advertisement -

ఇజ్రాయెల్ త‌వ్వ‌కాల్లో ఏం దొరికాయి?

పుర్రెకు సంబంధించిన ముక్క‌లు, పూర్తి స్థాయిలో ఉన్న ద‌వ‌డ భాగం క‌నిపించాయి. అయితే ఇవి ఆ స‌మ‌యంలో జీవించిన మ‌నుషుల ల‌క్ష‌ణాల‌తో పోలిస్తే భిన్నంగా ఉన్నాయి. ఈ ఎముక‌లు 1,40,000 నుంచి 1,20,000 ఏళ్ల మధ్య‌విగా గుర్తించారు. వీళ్లు అటు నియాండ‌ర్త‌ల్స్‌, ఇటు హోమో సేపియ‌న్స్ జాతికి చెందిన వాళ్లు కాద‌ని ఓ అంచ‌నాకు వ‌చ్చారు. ఇంత‌కు ముందు ఎప్పుడూ గుర్తించ‌ని ఓ కొత్త మిస్ట‌రీ మాన‌వ జాతి ఇది.

ఇదే ప్ర‌దేశంలో కాలిపోయిన జంతువుల ఎముక‌లు కూడా క‌నిపించాయి. దీనిని బ‌ట్టి ఈ మాన‌వ జాతి వేటాడి త‌మ ఆహారాన్ని సంపాదించుకునే వార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. అక్క‌డే క్యాంప్ ఫైర్ ప్ర‌దేశాల‌ను కూడా గుర్తించారు. అంటే ఈ జాతి నిప్పును ఉప‌యోగించ‌డం బాగా తెలిసిన వాళ్ల‌న్న అంచ‌నాకు పరిశోధ‌కులు వ‌చ్చారు.

నెష‌ర్ రామ్లా హోమో

ఈ కొత్త మిస్ట‌రీ జాతికి నెషెర్ రామ్లా హోమో అనే పేరు పెట్టారు. వీళ్లు నియాండ‌ర్త‌ల్స్ ప‌రిణామానికి కార‌ణ‌మై ఉంటార‌ని ప‌రిశోధ‌కులు భావిస్తున్నారు. ఇన్నాళ్లూ నియాండ‌ర్త‌ల్స్ అనే వాళ్లు యూరప్‌లో ఉండేవార‌ని, ఆధునిక మాన‌వుడు మాత్రం ఆఫ్రికాలోని హోమో సేపియ‌న్స్ నుంచి వ‌చ్చాడ‌న్న సులువైన సిద్ధాంతాన్ని ఈ తాజా ఆవిష్క‌ర‌ణ క్లిష్ట‌త‌రం చేసింద‌ని హీబ్రూ యూనివ‌ర్సిటీకి చెందిన ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ యోసి జైడ్‌న‌ర్ అన్నారు.

ఈ ఎముక‌లు ఓ సింక్‌హోల్‌లో క‌నిపించాయి. ఆ స‌మ‌యంలో ఇందులో భారీగా నీళ్లు నిల్వ ఉండేవ‌ని భావిస్తున్నారు. మొత్తానికి మాన‌వ ప‌రిణామ సిద్ధాంతంలో ఇన్నాళ్లూ మిస్స‌యిన ఓ కీల‌క‌మైన భాగాన్ని ఈ రామ్లా త‌వ్వ‌కాలు బ‌య‌ట‌పెట్టాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొత్త ట్విస్ట్‌.. ఇజ్రాయెల్‌లో బ‌య‌ట‌ప‌డ్డ మిస్ట‌రీ మాన‌వ జాతి
కొత్త ట్విస్ట్‌.. ఇజ్రాయెల్‌లో బ‌య‌ట‌ప‌డ్డ మిస్ట‌రీ మాన‌వ జాతి
కొత్త ట్విస్ట్‌.. ఇజ్రాయెల్‌లో బ‌య‌ట‌ప‌డ్డ మిస్ట‌రీ మాన‌వ జాతి

ట్రెండింగ్‌

Advertisement