గురువారం 02 ఏప్రిల్ 2020
International - Mar 03, 2020 , 02:09:45

ఏడాదిలో మూడోసారి ఎన్నికలు!

ఏడాదిలో మూడోసారి ఎన్నికలు!

జెరూసలేం: ఇజ్రాయెల్‌ ప్రజలకు ఎన్నికలంటేనే విసుగెత్తే పరిస్థితి నెలకొన్నది.  ఏడాదిలోపునే మూడోసారి అక్కడ పార్లమెంట్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ప్రతిష్ఠంభనను తొలగించేందుకు సోమవారం మరోసారి ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్‌ 9, సెప్టెంబర్‌ 17న జరిగిన గత రెండు ఎన్నికల్లో ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ సారథ్యంలోని లికుడ్‌పార్టీకి గానీ, బెన్నీ గాంట్జ్‌ నేతృత్వంలోని బ్లూ అండ్‌ వైట్‌ కూటమికి గానీ స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. మూడోసారి జరుగుతున్న ఈ ఎన్నికల్లోనూ అదే ఫలితం పునరావృతమయ్యే అవకాశం ఉన్నది. సాయంత్రం 4 గంటల సమయానికి 47 % పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 1999 తర్వాత ఈ స్థాయి పోలింగ్‌ నమోదుకావడం ఇదే తొలిసారి. నాటి ఎన్నికల్లో నెతన్యాహూ.. ఎహుద్‌ బరాక్‌ చేతిలో పరాజయం పాలవడం గమనార్హం. కాగా, మంగళవారం ఉదయానికి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 
logo