e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home News వ‌య‌సు త‌గ్గించుకునేందుకు అమెజాన్ అధినేత కోట్లు ఖ‌ర్చు పెట్టారా? అస‌లు వృద్ధాప్యాన్ని ఆప‌డం సాధ్య‌మేనా?

వ‌య‌సు త‌గ్గించుకునేందుకు అమెజాన్ అధినేత కోట్లు ఖ‌ర్చు పెట్టారా? అస‌లు వృద్ధాప్యాన్ని ఆప‌డం సాధ్య‌మేనా?

Reverse aging | అమృతం సేవించాకే దేవతలకు అమరత్వం సిద్ధించిందన్నది పురాణ వచనం. ఒక దశకు చేరుకున్నాక వయసు వృద్ధిరేటు నిలిచిపోవడమే అమరత్వంలోని మూలార్థం. వైద్యశాస్త్రంలో చోటుచేసుకున్న గణనీయమైన అభివృద్ధి, కొత్త ఆవిష్కరణలు మనుషుల వృద్ధాప్యాన్ని నిరోధించే దిశగా పరిశోధనలను ముమ్మరం చేస్తున్నాయి. వయసును వెనక్కి మళ్లించే ‘రివర్స్‌ ఏజింగ్‌ ‘ కాన్సెప్ట్‌పై ప్రయోగాలు చేయడానికి ఇప్పటికే పలు కంపెనీలూ పురుడుపోసుకున్నాయి. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ తన వృద్ధాప్యాన్ని నిలువరించుకునేందుకు అమెరికాకు చెందిన రివర్స్‌ ఏజింగ్‌ ప్రయోగాల కంపెనీ ‘ఆల్టోస్‌ ల్యాబ్స్‌’కు ఇటీవల కోట్లాది రూపాయలను ముట్టజెప్పారు. ఈ క్రమంలో ‘రివర్స్‌ ఏజింగ్‌’ నిజంగా సాధ్యమా? ఇప్పటివరకూ ఏమైనా ప్రయోగాలు జరిగాయా? తదితర అంశాలపై ప్రత్యేక కథనం..

ఏమిటీ ‘ రివర్స్‌ ఏజింగ్‌ ( Reverse aging )’?

జీవితంలో ఒక దశకు చేరుకున్నాక వయసును స్తంభింపజేసి, అక్కడి నుంచి వయసును యవ్వన దశకు వెనక్కి తీసుకువచ్చే ప్రక్రియనే ‘రివర్స్‌ ఏజింగ్‌’ అంటారు. గడిచిన మూడు దశాబ్దాల్లో ఇప్పటికే దీనిపై పలు దేశాల్లో ప్రయోగాలు జరిగాయి. కరోనా సమయంలో గతేడాది ఇజ్రాయెల్‌ పరిశోధకులు చేపట్టిన ప్రయోగం ‘రివర్స్‌ ఏజింగ్‌’లో కీలకంగా చెబుతారు.

ఎలా చేయొచ్చు?

- Advertisement -

‘రివర్స్‌ ఏజింగ్‌’ను విజయవంతంగా పూర్తిచేయాలంటే శరీరంలోని తొమ్మిది కీలక భాగాలను సమన్వయంతో ప్రభావితం చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవి..

డీఎన్‌ఏ

వయసు పెరిగే కొద్దీ డీఎన్‌ఏ సహాయంతో కణాల మధ్య జరిగే సమాచార మార్పిడిలో పొరపాట్లు పెరుగుతాయి. ఈ దశను ‘జీనోమిక్‌ ఇన్‌స్టెబిలిటీ’ అంటారు. ఇది ఎక్కువైతే డీఎన్‌ఏ చెడిపోతుంది. దీంతో మూల కణాల పనితీరుపై ప్రభావం ఏర్పడి.. కణాల పునరుద్ధరణ ప్రక్రియ దెబ్బ తింటుంది. దీన్ని అరికట్టాలి

క్రోమోజోమ్‌

క్రోమోజోమ్‌ చివర ‘టెలోమెరెస్‌’ అనే రక్షణ కవచం ఉంటుంది. వయసు మీద పడే కొద్దీ ఆ కవచాలు అరిగిపోతాయి. దాంతో క్రోమోజోమ్‌లకు రక్షణ ఉండదు. ఇది వృద్ధాప్యం రావడంపై ప్రభావం చూపుతుంది. ‘టెలోమెరెస్‌’లు అరగకుండా చర్యలు చేపట్టాలి.

మైటోకాండ్రియా

శరీరంలోని కణాలకు మైటోకాండ్రియా శక్తి అందిస్తుంది. కానీ, వయసు పెరిగే కొద్దీ వాటిలో క్రియాశీలత తగ్గుతూ వస్తుంది. మైటోకాండ్రియా క్రియాశీలతను ఉత్తేజితం చేస్తే క్షీరదాల జీవిత కాలాన్ని పెంచొచ్చు.

మూల కణాలు

వయసు మీదపడుతున్న కొద్దీ మూలకణాలు బలహీనపడి కణాల పునరుత్పాదనలో విఫలమవుతాయి. మూలకణాలను పునరుద్ధరించడం ద్వారా త్వరగా వృద్ధాప్యం రాకుండా చేసే వీలుందని పరిశోధనలు చెప్తున్నాయి.

కణాల ప్రవర్తన

మన శరీరం కొన్ని బాహ్యజన్యు (ఇపీజెనిటిక్‌) ప్రక్రియలను అభివృద్ధి చేస్తుంది. వయసులో పెరుగుదల, జీవనశైలిలో మార్పులు ఈ ప్రక్రియను సజావుగా సాగనివ్వవు. దీంతో కణాలకు తప్పుడు ఆదేశాలు వెళ్లడంతో అవి భిన్నమైన జీవక్రియలను నెరవేరుస్తాయి. దీన్ని అడ్డుకోవాలి.

కణాల పునరుత్పత్తి

కొత్త కణాలు ఉత్పత్తి అయ్యేందుకు మాతృ కణాలను ఎప్పటికప్పుడు బయటకు పంపే సామర్థ్యం శరీరానికి ఉంటుంది. అయితే, వయసు పెరిగే కొద్దీ ఆ సామర్థ్యం తగ్గుతుంది. దీన్ని నివారించాలి.

కణాల జీవక్రియ

ఏళ్లు గడిచే కొద్ది కొవ్వులు, చక్కెర లాంటి పదార్థాలను ప్రాసెస్‌ చేసే సామర్థ్యాన్ని కణాలు కోల్పోతాయి. దాంతో పోషకాలను కణాలు సరిగా జీర్ణం చేసుకోలేవు. ఈ ప్రక్రియను మార్చాలి.

కణాల వయసు

ఒక కణం బాగా దెబ్బతిన్నప్పుడు, వయసు పెరిగినప్పుడు అపరిపక్వ కణాల పుట్టుకను అడ్డుకునే పనిని ఆపేస్తుంది. దీన్ని అడ్డుకోవాలి.

కణాల మధ్య సమాచార మార్పిడి

మన శరీరంలోని కణాల మధ్య నిత్యం సమాచార మార్పిడి జరుగుతుంది. అయితే, ఏళ్లు గడిచే కొద్దీ ఆ సమాచారం అందిపుచ్చుకునే సామర్ధ్యం తగ్గుతుంది. దీన్ని నివారించాలి.

వయసు తగ్గింపు ప్రయోగాల్లో ఇజ్రాయెల్‌ సక్సెస్‌!

రక్తకణాల వయసును తగ్గిస్తూ తద్వారా ‘రివర్స్‌ ఏజింగ్‌’ ప్రక్రియను సాధ్యం చేయడానికి ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీశాస్త్రవేత్తలు గతేడాది హైపర్‌బారిక్‌ ఆక్సిజన్‌ ట్రీట్మెంట్‌ (హెచ్‌బీవోటీ-ఆక్సిజన్‌ చాంబర్‌లో వలంటీర్లను ఉంచి స్వచ్ఛమైన గాలిని రక్తకణాల్లోకి ప్రసరించేలా చేస్తారు)ని వినియోగించారు. 64 ఏండ్ల పైబడిన 35 మందిపై 90 రోజుల్లో 60 హెచ్‌బీవోటీ సెషన్లను నిర్వహించారు. ఈ ప్రక్రియలో ‘టెలోమెరెస్‌’ అరుగుదలను నిలువరిస్త్తూ, కణాల ప్రవర్తనను నియంత్రించారు. దీంతో 64 ఏండ్లవారు 50 ఏండ్ల వయసులవారికి మళ్లే పనులు చేసుకోగలిగారని, ముఖవర్చస్సు, శరీరాకృతిలోనూ మార్పులు వచ్చాయని పరిశోధకులు తెలిపారు. గూగుల్‌, ఒరాకిల్‌ సంస్థల అధిపతులు కూడా ‘రివర్స్‌ ఏజింగ్‌’పై ఇప్పటికే వందల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

మ‌న‌కు ‘రా’ ఇంటెలిజెన్స్‌.. మ‌రి పాక్‌, చైనా దేశాల‌ నిఘా సంస్థ‌ల గురించి తెలుసా?

ఫైన‌ల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి ప్ర‌పంచ‌క‌ప్ తెచ్చాడు.. ఇప్పుడు కూలీగా మారాడు

ఆ ఊరిపెద్ద భారత్‌లో భోజనం చేస్తాడు.. మయన్మార్‌లో నిద్రపోతాడు!

Whistle village : ఆ ఊళ్లో పేర్లు ఉండ‌వ్‌.. విజిల్‌తోనే పిలుచుకుంట‌రు

కొంప‌ముంచిన సెల‌బ్రెటీల ట్వీట్లు.. ఒక్కో పోస్టుతో వేల‌ కోట్ల రూపాయ‌లు ఆవిరి !

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana