సోమవారం 06 ఏప్రిల్ 2020
International - Feb 05, 2020 , 19:45:32

విమానంలో గన్‌ వదిలిపెట్టిన కామెరాన్‌ బాడీగార్డు

విమానంలో గన్‌ వదిలిపెట్టిన కామెరాన్‌ బాడీగార్డు

లండన్‌: బ్రిటన్‌ మాజీ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ బాడీగార్డు విమానంలోని బాత్‌రూమ్‌లో తుపాకి వదిలిపెట్టడం చర్చనీయాంశమైంది. ట్రాన్స్‌-అట్లాంటిక్‌ విమానంలో దొరికిన గన్‌ను లండన్‌ మెట్రో పాలిటన్‌ పోలీసులు విమాన సిబ్బందికి అందజేశారు. గన్‌తోపాటు కామెరాన్‌, బాడీగార్డు పాస్‌పోర్టులు సోమవారం గుర్తించాం. అయితే అప్పటి నుంచి సదరు అధికారిని విధుల నుంచి తొలగించడం జరిగింది. గన్‌ వదిలిపెట్టి వెళ్లడాన్ని తాము సీరియస్‌గా పరిగణిస్తున్నాం. దీనిపై విచారణ కొనసాగిస్తున్నామని పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిబంధనల ప్రకారం ప్రత్యేక పోలీస్‌ యూనిట్‌ బ్రిటన్‌ మాజీ ప్రధాని కామెరాన్‌ బందోబస్తును చూస్తుంది. 


logo