మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 04, 2020 , 16:30:00

‘వ్యాక్సిన్‌ వచ్చే వరకు అందరికీ కరోనా పరీక్షలు చేయాలి’

‘వ్యాక్సిన్‌ వచ్చే వరకు అందరికీ కరోనా పరీక్షలు చేయాలి’

లండన్‌  : మరోసారి లాక్‌డౌన్‌ అవసరం లేకుండా లక్షణాలు ఉన్న వారికే కాకుండా లేనివారికి కూడా కరోనా పరీక్షలు చేయడం చాలా అవసరమని యూకే మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్ అన్నారు.

బ్లెయిర్‌ టైమ్స్ రేడియోతో మాట్లాడుతూ కొన్ని అంచనాల ప్రకారం కరోనా ఉన్నవారిలో 70శాతం మంది లక్షణాలు లేనివారేనని, కాబట్టి లక్షణాలున్న వారికే పరీక్షలు చేస్తే దానివల్ల మరో కొత్త సమస్య వచ్చి పడుతుందన్నారు. టీకా, సమర్థవంతమైన చికిత్స అందుబాటులోకి వచ్చే వరకు వైరస్ వ్యాప్తిని అదుపులో ఉంచడానికి ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు చేయాలని మాజీ పీఎం చెప్పారు.

పరీక్షల సంఖ్యను పెంచినందుకు ఆయన ప్రభుత్వాన్ని ప్రశంసించారు. కానీ ఇంకా ఎక్కువ పరీక్షలు చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.  బ్లెయిర్ - 1997 నుంచి 2007 వరకు యూకేకు ప్రధానమంత్రిగా ఉన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo