బుధవారం 03 జూన్ 2020
International - May 21, 2020 , 21:59:19

లాక్‌డౌన్‌ ఎత్తేయకుంటే మరిన్ని మరణాలు: ట్రంప్‌

లాక్‌డౌన్‌ ఎత్తేయకుంటే మరిన్ని మరణాలు: ట్రంప్‌

వాషింగ్టన్‌: లాక్‌డౌన్‌ ఎత్తివేయనిపక్షంలో నిరాశ, నిస్పృహ, ఒంటరితనంతో ప్రజలు మరింత మంది చనిపోతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆందోళన వ్యక్తంచేశారు. లాక్‌డౌన్‌ను సడలించి వ్యాపారాలను పునరుద్ధరించే అంశంపై వివిధ దేశాలు ఆచితూచి స్పందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తితో తమకు సంబంధం లేదని చైనా అధికారి ఒకరు చేసిన ప్రకటనపై ట్విట్టర్‌ వేదికగా ట్రంప్‌ ప్రతిస్పందిస్తూ ఆ దేశం ‘అసమర్థత’ వల్లే కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా సామూహిక మరణాలు సంభవిస్తున్నాయని ట్రంప్‌ ఆరోపించారు. కాగా, వివిధ దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో వచ్చేనెలలో జీ-7 సదస్సు నిర్వహించి, చైనాను ఏకాకిని చేయాలని ట్రంప్‌ తలపోస్తున్నారు. 


logo