Evergrande Crisis | ప్రస్తుతం తాము ఎదుర్కొంటున్న సంక్షోభం.. కష్టకాలం నుంచి ఖచ్చితంగా బయటపడతామని చైనా రియాల్టీ సంస్థ ఎవర్‌గ్రాండ్ చైర్మన్ హుయి కా యువాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం తాము చేపట్టిన ప్రాజెక్టులన్నీ తప్పకుండా పూర్తి చేస్తామని మంగళవారం కంపెనీ ఉద్యోగులకు రాసిన లేఖలో హామీ ఇచ్చారు. సంక్షోభం నుంచి బయటపడటానికి ఉద్యోగుల సహకారం తీసుకుని లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు.
ఎవర్ గ్రాండ్‌కు చైనా రియాల్టీ రంగంలో రెండు శాతం వాటా ఉంది. అయితే గతేడాది ద్రవ్య లభ్యత సమస్యను ఎదుర్కొంటున్నది. 15 లక్షల మంది ఇండ్లు నిర్మించి ఇవ్వాల్సి ఉంది. తమ సిబ్బందికి వేతనాలివ్వలేని దుస్థితికి చేరుకున్నది. ఈ సంస్థకు సుమారు రూ.22.50 లక్షల కోట్లు (300 బిలియన్ డాలర్లు) అప్పులు ఉన్నాయి. అయితే, అప్పుల ఊబిలో చిక్కుకున్న తమ కంపెనీని గట్టెకించడానికి తన ప్లాన్ ఏమిటో హుయి కా యువాన్ వెల్లడించలేదు.