గురువారం 29 అక్టోబర్ 2020
International - Oct 15, 2020 , 21:59:02

జిరాఫీ గడ్డి ఎలా తింటుందో తెలుసా?వీడియో

జిరాఫీ గడ్డి ఎలా తింటుందో తెలుసా?వీడియో

భూమిపైన అతి ఎత్తైన జంతువులు జిరాఫీలు..ఎత్తైన కాళ్లు, పొడవాటి మెడ కలిగి ఉంటాయి. అయితే, అవి ఇప్పటిదాకా చెట్టుమీది కొమ్మలను తినడం మాత్రమే మనం చూశాం. వంగి గడ్డిమేయడం చూడలేదు. ఇటీవల అవి నేలమీద గడ్డిమేస్తున్న వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

ఈ వీడియోను ట్విట్టర్ యూజర్ ఏఎన్‌ఎన్‌ డానీడచ్ షేర్ చేశారు. ‘జిరాఫీ ఎలా గడ్డి మేస్తుందో ఇంతకుముందు నేను ఎప్పుడూ ఆలోచించలేదు.. కానీ ఇది భలేగుంది!’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. ఏడు సెకన్ల నిడివిగల ఈ వీడియోలో జిరాఫీ ముందుకాళ్లను పక్కకు చాచి..తలను నేలపై ఆనించి గడ్డి మేస్తోంది. గడ్డి నోట్లోకి వెళ్లిన తర్వాత యధాస్థితికి వస్తుంది. ఈ వీడియోను ఇప్పటివరకూ 9.8 మిలియన్ల మందికిపైగా వీక్షించారు. 2 లక్షల లైక్‌లు వచ్చాయి. మరెందుకాలస్యం మీరూ చూసేయండి ఆ వీడియో.. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo