శనివారం 04 జూలై 2020
International - Jul 01, 2020 , 11:20:38

స‌రిహ‌ద్దులు తెరిచిన యూరోపియ‌న్ యూనియ‌న్‌

స‌రిహ‌ద్దులు తెరిచిన యూరోపియ‌న్ యూనియ‌న్‌

న్యూఢిల్లీ: ‌నాలుగు నెల‌లుగా అష్ట దిగ్భంధనం చేసినా క‌రోనా కేసులు న‌మోదులో ఏమాత్రం త‌గ్గుద‌ల క‌నిపించ‌క‌పోవ‌డంతో ఇప్పుడు యూరోపియన్‌ యూనియన్ సైతం స‌డ‌లింపుల బాటప‌ట్టింది. అందులో భాగంగానే ఈ రోజు 15 దేశాల‌తో స‌రిహ‌ద్దుల‌ను తిరిగి తెరించింది. క‌రోనా విస్త‌ర‌ణ నేప‌థ్యంలో మార్చి మూడో వారం నుంచి యూరోపియ‌న్ యూనియ‌న్ వివిధ దేశాల‌తో స‌రిహ‌ద్దుల‌ను మూసివేసింది. అందులో ఇప్పుడు 15 దేశాల స‌రిహ‌ద్దులను తెరిచింది. 

అయితె, యూరోపియ‌న్ యూనియ‌న్ స‌రిహ‌ద్దుల‌ను తెరిచిన 15 దేశాల జాబితాలో భార‌త్‌, అమెరికా, ర‌ష్యా, బ్రెజిల్ దేశాలు లేవు. ఆయా దేశాల్లో క‌రోనా ప్ర‌భావం తీవ్రంగా ఉన్నందున వారితో స‌రిహ‌ద్దుల‌ను తెరువ‌లేద‌ని ఈయూ వివ‌రించింది. 27 సభ్య దేశాలున్న యూరోపియన్‌ యూనియన్‌ ఓటింగ్‌ విధానం ద్వారా అల్జీరియా, ఆస్ట్రేలియా, కెన‌డా, జార్జియా, జపాన్, మాంటేనీగ్రో, మొరాకో, న్యూజీలాండ్‌, రువాండా, సెర్బియా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, ట్యునీషియా, ఉరుగ్వే దేశాల సరిహద్దులను తెరిచింది. 

జాబితాలో 15వ దేశంగా చైనా పేరు కూడా ఉన్నా యూరోపియ‌న్ యూనియ‌న్‌కు చైనా స‌రిహ‌ద్దులు తెరిస్తేనే చైనాకు త‌మ‌ స‌రిహ‌ద్దులు తెరువ‌నున్న‌ట్లు ఈయూ ప్ర‌క‌టించింది. కాగా, 15 దేశాల‌కు స‌రిహ‌ద్దులు తెరుస్తూ తాము తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేసే బాధ్యత సభ్యదేశాలపై ఉంటుందని ఈయూ‌ ప్రకటించింది.


logo