సోమవారం 06 ఏప్రిల్ 2020
International - Jan 30, 2020 , 02:15:59

సీఏఏ వివక్షాపూరితం

సీఏఏ వివక్షాపూరితం
  • భారీ సంఖ్యలో పౌరులను శరణార్థులుగా మారుస్తుంది
  • భారత్‌కు దౌత్యపరమైన విజయం
  • ఓటింగ్‌ మార్చి నెలకు వాయిదా
  • సీఏఏపై ఐరోపా పార్లమెంట్‌లో ముసాయిదా తీర్మానం

లండన్‌, జనవరి 29: భారత్‌లో మోదీ సర్కార్‌ అమలు చేయనున్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఐరోపా యూనియన్‌ పార్లమెంట్‌ సభ్యులు ప్రవేశపెట్టిన సంయుక్త ముసాయిదా తీర్మానంపై ఐరోపా పార్లమెంట్‌లో బుధవారం చర్చ ప్రారంభమైంది. ఈ తీర్మానంపై గురువారం జరుగాల్సిన ఓటింగ్‌ను మార్చి నెలకు వాయిదా వేశారు. ఐరోపా పార్లమెంట్‌లోని ఆరు ప్రధాన రాజకీయ గ్రూపులు వేర్వేరుగా రూపొందించిన తీర్మానాలను ఏకాభిప్రాయంతో ఒకే సంయుక్త ముసాయిదా తీర్మానంగా ప్రవేశపెట్టారు. సీఏఏతోపాటు జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)ని ఈ తీర్మా నం తీవ్రంగా తప్పు పట్టింది. సీఏఏ, ఎన్నార్సీలతో భారత ప్రభుత్వం అణగారిన వర్గాలు  ల క్ష్యంగా  దాడులు జరిపే ప్రమాదం ఉందని, ఆ చట్టాల వల్ల భారీ స్థాయిలో పౌరులు శరణార్థులుగా మారితే తీవ్ర సంక్షోభం తలెత్తే అవకాశం ఉందన్నది. ‘సీఏఏ..స్వభావరీత్యా వివక్షాపూరితం.. ప్రమాదకర  విభజనకారిణి’ అని తెలి పింది. 


భారత ప్రభుత్వం దేశంలోని పలు వర్గాలతో శాంతి చర్చలు జరుపాలని, సీఏఏలోని వివక్షాపూరిత సవరణలను తొలిగించాలని డి మాండ్‌ చేసింది. అంతర్జాతీయ  ఒప్పందాలను సీఏఏ ఉల్లంఘిస్తున్నదన్నది. భారత్‌లో సంకుచిత జాతీయవాదం నానాటికీ పెచ్చరిల్లుతున్నదని, ఫలితంగా మతపరమై న అసహనం, ముస్లింలపై వివక్ష కూడా  పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. కశ్మీర్‌లో ఇంటర్నెట్‌పై నిషేధాన్నీ తీర్మానం ఖండించింది. సీఏఏపై ఐరోపా పార్లమెంట్‌ ప్లీనరీ సమావేశాల్లో మార్చి 30 లేదా 31న ఓటింగ్‌ జరుగనుంది. గురువారం ఓటింగ్‌ను ఎందుకు  వాయిదా వేశారో స్పష్టతనీయలేదు. ఇది భారత్‌కు దౌత్యపరమైన విజయమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


బ్రెగ్జిట్‌కు ఆమోదం

ఐరోపా యూనియన్‌ (ఈయూ) నుంచి బ్రిటన్‌ నిష్క్రమణను యూరోపియన్‌ పార్లమెంట్‌ బుధవారం ఆమోదించిం ది. ఈ మేరకు పార్లమెంట్‌ బ్రెగ్జిట్‌ ఒప్పందానికి ఆమోద ముద్ర వేసింది. దీంతో ఈయూ నుంచి బ్రిటన్‌ నిష్క్ర మణకు చివరి అవరోధం తొలిగింది.


logo