శనివారం 04 జూలై 2020
International - Jul 01, 2020 , 09:38:41

పైల‌ట్ల‌కు ఫేక్ లైసెన్సులు.. పాక్ ఎయిర్‌లైన్స్‌పై స‌స్పెన్ష‌న్‌

పైల‌ట్ల‌కు ఫేక్ లైసెన్సులు.. పాక్ ఎయిర్‌లైన్స్‌పై స‌స్పెన్ష‌న్‌

హైద‌రాబాద్‌: పాకిస్థాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌లైన్స్‌పై యురోపియ‌న్ యూనియ‌న్ ఆర్నెళ్ల స‌స్పెన్ష‌న్ విధించింది. పాక్‌కు చెందిన ఎయిర్‌లైన్స్ సుమారు మూడ‌వ వంత పైల‌ట్ల‌ను తొల‌గించింది.  ఫేక్ లైసెన్సులు క‌లిగి ఉన్నార‌ని వారిని విధుల నుంచి బ‌హిష్క‌రించింది.  దీంతో యురోపియ‌న్ యూనియ‌న్ ఏవియేష‌న్ సేఫ్టీ ఏజెన్సీ కూడా పీఐఏపై ఆంక్ష‌లు విధించింది. ప్ర‌స్తుతం ఉన్న పైల‌ట్ల‌లో ఎంత మంది అర్హులో తెలియ‌ద‌ని, వాళ్లంతా త‌మ విశ్వాసాన్ని కోల్పోయార‌ని పీఐఏ ప్ర‌తినిధి అబ్దుల్లా ఖాన్ తెలిపారు. 

పాకిస్థాన్  ఎయిర్‌లైన్స్‌తో పాటు ప్రైవేటు పాక్ విమానాల‌ను సస్పెండ్ చేస్తున్న‌ట్లు యురోపియ‌న్ యూనియ‌న్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.  పైల‌ట్ల‌కు ఇచ్చిన లైసెన్సుల్లో ఎక్కువ శాతం న‌కిలీవే ఉన్న‌ట్లు పాకిస్థాన్ పార్ల‌మెంట్‌లోనూ పేర్కొన్నారు.  క‌రోనా వైర‌స్ స‌మ‌యంలో పైల‌ట్ల కొర‌త వ‌ల్ల పాక్ అతి త‌క్కువ స్థాయిలో విమానాల‌ను న‌డిపింది.  గ‌త నెల‌లో పాక్‌లో జ‌రిగిన ఓ విమాన ప్ర‌మాదానికి పైల‌ట్ నిర్ల‌క్ష్యమ‌ని తేలింది. ఆ ప్ర‌మాదంలో 98 మంది మ‌ర‌ణించారు. 860 మంది పైల‌ట్ల‌లో 262 మందికి ఫేక్ లైసెన్సులు ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. 


logo