సోమవారం 01 జూన్ 2020
International - Apr 15, 2020 , 14:46:30

ఐరోపాలో పది లక్షలు దాటిన కరోనా కేసులు

ఐరోపాలో పది లక్షలు దాటిన కరోనా కేసులు

హైదరాబాద్‌: ఐరోపాలో పది లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాణాంతక వైరస్‌ పుట్టింది చైనాలో అయినా ఎక్కువగా ప్రభావితమైనది మాత్రం ఐరోపా దేశాలు. ఖండంలోని ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌లు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్యలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయంటే అక్కడి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో ఊహించుకోవచ్చు. ఐరోపాలో ఇప్పటివరకు 10,03,284 కరోనా కేసులు నమోదవగా, 84,465 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 20,08,251 కేసులు నమోదవగా, 1,27,168 మంది మరణించారు. ఈ ప్రాణాంతక మహమ్మారి వల్ల ఇప్పటివరకు స్పెయిన్‌లో 18255 మంది, ఇటలీలో 21,067 మంది, ఫ్రాన్స్‌లో 15,729 మంది, జర్మనీలో 3495 మంది మరణించారు. 


logo