శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 01, 2020 , 13:32:38

యూరప్‌లో 30వేలు దాటిన మరణాలు

యూరప్‌లో 30వేలు దాటిన మరణాలు

లండన్‌:  చైనాలో పుట్టిన కరోనా వైరస్‌(కోవిడ్‌-19) ఐరోపా దేశాలకు విస్తరించి అతలాకుతలం చేస్తోంది. ఇన్నాళ్లూ ఇటలీలో వేగంగా విజృంభించిన ఈ మహమ్మారి ఇప్పుడు స్పెయిన్‌, ఫ్రాన్స్‌లో వేగంగా విస్తరిస్తోంది.  బుధవారం వరకు యూరప్‌లో 4,58,601 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. అందులో 30,063 మంది మరణించారు.  ఇటలీలో అత్యధికంగా  12,428 మంది కరోనా కారణంగా చనిపోయారు.  

స్పెయిన్‌లో మృతుల సంఖ్య 8,189కి చేరగా.. ఫ్రాన్స్‌లో 3,523 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్‌లో మంగళవారం ఒక్కరోజే 499 మంది కరోనా కారణంగా చనిపోయారు.  కోవిడ్‌-19 విజృంభిస్తుండంతో  యూరప్‌ వణికిపోతోంది.  జర్మనీలో కొత్తగా 5,453 కేసులు నమోదు కాగా..149 మంది మృత్యువాత పడ్డారు. జర్మనీలో కరోనా సోకిన వారి సంఖ్య 67,366 చేరగా.. మృతుల సంఖ్య 732కు చేరుకుంది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo