గురువారం 28 జనవరి 2021
International - Dec 20, 2020 , 21:02:14

బ్రిటన్‌ విమానాలపై ఈయూ దేశాల నిషేధం

బ్రిటన్‌ విమానాలపై ఈయూ దేశాల నిషేధం

లండన్‌: లండన్‌లో కరోనా న్యూ స్ట్రైయిన్‌ విజృంభిస్తుండటంతో పలు యూరోపియన్‌ దేశాలు బ్రిటన్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. నెదర్లాండ్‌ ఆదివారం నుంచే బ్రిటన్‌ నుంచి వచ్చే అన్ని ప్రయాణ విమాన సర్వీసులపై నిషేధం విధించగా.. అదే ఆప్షన్‌ను తామూ పరిశీలిస్తున్నట్లు జర్మనీ అధికార వర్గాలు తెలిపాయి. బ్రిటన్‌, దక్షిణాఫ్రికా దేశాల నుంచి విమాన సర్వీసులను నిలిపివేస్తామని ఆ వర్గాలు చెప్పాయి. 

ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి జనవరి ఒకటో తేదీ వరకు బ్రిటన్‌ విమానాలపై నిషేధం విధిస్తున్నట్లు డచ్‌ ప్రకటించింది. బెల్జియం మరో అడుగు ముందుకేసి ఆదివారం అర్థరాత్రి నుంచి బ్రిటన్‌ విమాన, రైళ్ల రాకపోకలను సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపింది. కరోనాలో నూతన స్ట్రెయిన్‌ రాకతో పరిస్థితి విషమించిందని బ్రిటన్‌ ఆరోగ్యశాఖ మంత్రి మ్యాట్‌ హంకాక్‌ హెచ్చరించారు. 

ఈ తరహా స్ట్రెయిన్‌ వైరస్‌ తొలుత సెప్టెంబర్‌లో ఒక వ్యక్తికి సోకినట్లు తెలుస్తున్నది. ఇంగ్లండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అధికారి సుసాన్‌ హోప్‌కిన్స్‌ మాట్లాడుతూ నూతన వైరస్‌ 70శాతం ఇతరుల్లోకి ట్రాన్స్ మీట్‌ అవుతుందని ద్రువీకరించారు. పరిస్థితి అదుపు తప్పడంతో క్రిస్మస్‌ వేడుకలు ఇళ్ల వద్దనే చేసుకోవాలని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo