బుధవారం 01 ఏప్రిల్ 2020
International - Mar 17, 2020 , 11:45:34

ఈయూ సరిహద్దులు, స్కెంజన్‌ జోన్‌ 30 రోజుల పాటు మూసివేత

ఈయూ సరిహద్దులు, స్కెంజన్‌ జోన్‌ 30 రోజుల పాటు మూసివేత

ప్యారిస్‌ : యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ), స్కెంజన్‌ జోన్‌ను 30 రోజుల పాటు మూసివేస్తున్నట్లు ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్‌ మాక్రాన్‌ తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నేటి నుంచి 30 రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు మాక్రాన్‌ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రయాణాలపై సైతం 15 రోజుల పాటు తీవ్ర ఆంక్షలు కొనసాగుతాయన్నారు. ప్రజా సమావేశాలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. 

కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 162 దేశాలకు విస్తరించింది. లక్షా 82 వేల 547 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు. మొత్తం 7,164 మంది మృతిచెందారు. దేశాల వారీగా చైనాలో 3,226, ఇటలీలో 2,158, ఇరాన్‌లో 853, స్పెయిన్‌లో 342, ఫ్రాన్స్‌లో 148, అమెరికాలో 87, దక్షిణ కొరియాలో 81, యూకేలో 55, జపాన్‌లో 27, నెదర్లాండ్స్‌లో 24  మంది కోవిడ్‌-19 కారణంగా మృతిచెందారు.


logo
>>>>>>