సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Jul 11, 2020 , 18:49:25

భారత్‌ నుంచి అబుదాబికి విమాన సర్వీసులు..

భారత్‌ నుంచి అబుదాబికి విమాన సర్వీసులు..

న్యూఢిల్లీ : ఈ నెల 12 నుంచి 26 మధ్య యూఏఈలోని అబుదాబికి ఆరు భారతీయ నగరాల నుంచి పరిమిత సంఖ్యలో ప్రత్యేక విమానాలను నడపనున్నట్లు ఎతిహాద్ ఎయిర్ వేస్ ప్రకటించింది. ఈ కాలంలో బెంగళూరు, చెన్నై, కొచ్చి, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై నుంచి అబుదాబికి విమాన సర్వీసులు నడపనుంది. ప్రయాణికులందరూ ముందు అబుదాబి ప్రభుత్వం నుంచి ఐసీఏ అనుమతి ఉండాలని, అవసరమైన అనుమతులు లేకుండా వస్తే చెక్‌ ఇన్‌కు అనుమతించమని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ విమానయాన సంస్థ ఈ ప్రకటన చేసింది. భారత్, యూఏఈ ప్రభుత్వాల మధ్య సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా, ప్రస్తుతం భారత్‌లో ఉన్న యూఏఈ ప్రవాస జాతీయులు యూఏఈకి తిరిగి వచ్చేందుకు సాయం చేసే ఉద్దేశంతో సర్వీసులు నడుపుతున్నట్లు ఇరు దేశాలకు చెందిన పౌర విమానయాన శాఖ అధికారులు ఈ మేరకు ట్విట్టర్‌లో ప్రకటించారు. విమాన టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు ఎయిర్ లైన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఎతిహాద్‌ సూచించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo