కరోనాతో ఎస్వాతినీ ప్రధాని కన్నుమూత

జొహెన్నెస్‌బర్గ్: ఆఫ్రికాలోని అత్యంత చిన్న దేశమైన ఎస్వాతినీ ప్రధానమంత్రి ఆంబ్రోస్ ద్లామిని కరోనాతో మృతిచెందారు. నాలుగు వారాల క్రితం ఆయనకు కరోనా నిర్ధారణ అయ్యింది. అయితే మెరుగైన చికిత్స కోసం డిసెంబర్ 1న దక్షిణాఫ్రికాలోని ఓ దవాఖానలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం మరణించారు. కాగా, ప్రధాని మృతి వార్తను ఆ దేశ ఉపప్రధాని తెబా మసూకూ నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత అధికారికంగా ప్రకటించారు. దేశ ప్రజలకు దుర్వార్త. కరోనాతో చికిత్స పొందుతున్న ప్రధాని ఈ మధ్యాహ్నం దక్షిణాఫ్రికాలోని హాస్పిటల్లో కన్నుమూశారని చెప్పారు.
52 ఏండ్ల ఆంబ్రోస్ ఎస్వాతినీ ప్రధానిగా 2018 నవంబర్‌లో నియమితులయ్యారు. ఆయన బ్యాంకింగ్ రంగంలో 18 ఏండ్లకు పైగా పనిచేశారు. ఎస్వాతినీ నెడ్‌బ్యాంక్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. కాగా, ఎస్వతినిలో ఇప్పటివరకు 10.2 లక్షల మంది కరోనా బారినపడ్డారు. ఇందులో 6788 మంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. 127 మంది కరోనాతో మరణించారని ఆరోగ్య శాఖ ప్రకటించింది.
తాజావార్తలు
- మరో నాలుగు రోజులు..
- గ్రామాల అభివృద్ధేప్రభుత్వ ధ్యేయం
- ‘పట్టభద్రుల’ ఓటర్లు 4,91,396
- నేటి నుంచి నిరంతరాయంగా..
- ఆకాశం హద్దుగా!
- పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం
- కోడేరు అభివృద్ధ్దికి కంకణం కట్టుకున్నా
- ప్రభుత్వభూమి ఆక్రమణపై హైకోర్టును ఆశ్రయిస్తాం
- కాళేశ్వరంలో మళ్లీ జలసవ్వడి
- నల్లమల ఖ్యాతి నలుదిశలా విస్తరించాలి