బుధవారం 03 జూన్ 2020
International - May 20, 2020 , 16:57:24

ఇప్పుడు మీరంతా అవయవ దాతలే!

ఇప్పుడు మీరంతా అవయవ దాతలే!

లండన్‌: చనిపోయిన తర్వాత కూడా ఎనిమిది మందిలో బ్రతకడం కేవలం అవయవ దానం వల్లే నెరవేరుతుంది. అవయవ దానాన్ని మించిన దానం లేదంటున్నారు వైద్యనిపుణులు. నిత్యం ఎందరో అవయవ దాతల కోసం  ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నారు. అవయవ దానాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం జీవన్‌దాన్‌ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతంగా అమలుచేస్తున్న విషయం తెలిసిందే. అవయవాల కోసం  ఎదురుచూసే వ్యాధిగ్రస్థులు తమ పేర్లను జీవన్‌దాన్‌ ట్రస్ట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా దాతలు ముందుకు రాగానే లేదంటే ఎవరైనా ప్రమాదాలకు గురై కోమాలోకి వెళ్లిపోయి బ్రెయన్‌డెడ్‌గా ప్రకటించినవారు అందుబాటులోకి రాగానే అవసరమున్నవారికి అవయవాలను మార్పిడి చేస్తూ ప్రాణాలను నిలుపుతున్నారు.

అవయవ దానం ప్రాధన్యతను గుర్తించిన ఇంగ్లండ్‌ ప్రభుత్వం ఏకంగా ఒక చట్టాన్నే తీసుకొచ్చింది. వయసు మీరిన వారు చనిపోయిన తర్వాత వారు అవయవాలను దానం  చేసేందుకు అంగీకరిస్తున్నట్టు పరిగణించబడుతుందని ఆ చట్టంలో పేర్కొన్నారు.  అవయవ దానం కోసం ఒక మైలురాయిని చేరుకొన్నామని, ఈ చట్టం వల్ల ఏటా వందల  సంఖ్యలో జీవితాలను మార్చేందుకు  వీలుంటుందని బ్రిటన్‌ ఆరోగ్య కార్యదర్శి మాట్‌ హాంకాక్‌ చెప్పారు. ఈ పథకానికి మాక్స్‌ అండ్‌ కైరా చట్టంగా పిలువనున్నారు. 2017లో తొమ్మిదేండ్ల వయసులో మరణించిన కైరా బాల్‌, గుండె మార్పిడి ద్వారా ఊపిరి పోసుకొన్న 12 ఏండ్ల మాక్స్‌ జాన్సన్‌ కు గుర్తుగా ఈ చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఇంగ్లండ్‌లోని వృద్ధులంతా అవయవదాతలే!


logo