గురువారం 29 అక్టోబర్ 2020
International - Oct 11, 2020 , 02:41:56

నయా బానిసత్వంలో స్త్రీ!

నయా బానిసత్వంలో స్త్రీ!

ఐరాస: ప్రపంచవ్యాప్తంగా 2.9 కోట్ల మంది బాలికలు, మహిళలు బానిసత్వం, వెట్టిచాకిరీ, బలవంతపు వివాహాలు, భర్తల నుంచి వేధింపులు తదితర సమస్యల వలయంలో చిక్కుకున్నారని ఓ నివేదిక వెల్లడించింది. బానిసత్వ నిర్మూలన కోసం ఏర్పడ్డ వాక్‌ ఫ్రీ అనే స్వచ్ఛందసంస్థ, ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్‌వో), అంతర్జాతీయ వలస కార్మికుల సంస్థ సంయుక్తంగా ఈ నివేదికను విడుదల చేశాయి. ఈ సమస్యలన్నింటినీ ‘నయాబానిసత్వం’గా వాక్‌ ఫ్రీ సంస్థ అభివర్ణించింది.  ప్రతి 130 మందిలో ఒకరు ఈ సమస్యల్లో ఏదో ఒకటి ఎదుర్కొంటున్నారని పేర్కొంది. 


logo