ఆదివారం 29 నవంబర్ 2020
International - Oct 29, 2020 , 19:22:03

ఫ్రాన్స్‌ అధ్యక్షుడిపై ఇస్లాం దేశాల ఆగ్రహం..!

ఫ్రాన్స్‌ అధ్యక్షుడిపై ఇస్లాం దేశాల ఆగ్రహం..!

న్యూఢిల్లీ: దేశంలో రాడికల్‌ ఇస్లాం పెరిగిపోతున్నదని, దానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటామని ఇటీవల ఓ సమావేశంలో ప్రకటించిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌పై ఇస్లాం దేశాలు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. పలు దేశాల్లో ఆయన దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. నిరసన ప్రదర్శన చేపట్టారు. 

ఫ్రాన్స్‌లో పాఠశాల ఉపాధ్యాయుడు శామ్యూల్ పాటీ హత్య తర్వాత ఇస్లామిక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక పోరాటం చేస్తామని మాక్రాన్‌ ప్రకటించారు. దేశంలో రాడికల్ ఇస్లాంకు ఇక చోటు లేదని ఫ్రెంచ్ అధ్యక్షుడు స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉన్న దేశాల్లో ఫ్రెంచ్ ఉత్పత్తుల బహిష్కరణ చేపట్టారు. బ్యాన్‌ ఫ్రాన్స్ లాంటి హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్‌మీడియా దద్దరిల్లుతోంది. బంగ్లాదేశ్, ఇరాన్, పాకిస్తాన్‌లో పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. మక్రాన్‌ను సైతాన్‌గా పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు దర్శనమిస్తున్నాయి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.