శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 07, 2020 , 17:22:06

జపాన్‌లోనూ కరోనా విజృంభణ.. నేషనల్‌ ఎమర్జెన్సీ ప్రకటన

జపాన్‌లోనూ కరోనా విజృంభణ.. నేషనల్‌ ఎమర్జెన్సీ ప్రకటన

హైద‌రాబాద్‌: జ‌పాన్ ప్ర‌దాని షింజో అబే ఇవాళ అధికారికంగా దేశంలో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు.  టోక్యోతో పాటు ఒసాకా న‌గ‌రాల‌కు తాజా నిబంధ‌న‌లు వ‌ర్తించ‌నున్నాయి.  క‌రోనా వైర‌స్ శ‌ర‌వేగంగా ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో ఆయ‌న ఎమ‌ర్జెన్సీ విధిస్తున్నట్లు ఇవాళ మీడియాతో తెలిపారు.  ఈ సంద‌ర్భంగా ఆర్థిక ప్యాకేజీని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. 990 బిలియ‌న్ డాల‌ర్ల ఉద్దీప‌న‌ ప్యాకేజీ ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  బుధ‌వారం నుంచి జ‌పాన్‌లో ఎమ‌ర్జెన్సీ అమ‌లులోకి రానున్న‌ది. టోక్యో, ఒసాకాతో పాటు సైటామా, క‌న‌గ్వా, చిబా, హోగో, ఫుకోకో ప్రావిన్సుల్లో తాజా ఆదేశాలు వ‌ర్తించ‌నున్నాయి. ప‌బ్లిక్ హెల్త్ అధికారుల నుంచి తీవ్ర వ‌త్తిడి రావ‌డంతో ప్ర‌ధాని షింజో అబే ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. క‌నీసం నెల రోజుల పాటు ఆంక్ష‌లు విధిస్తూ.. వైర‌స్ వ్యాప్తి గురించి వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు చీఫ్ క్యాబినెట్ సెక్ర‌ట‌రీ సుగా తెలిపారు.


 logo