మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Aug 30, 2020 , 15:50:51

ఇదెక్కడి విడ్డూరం...! పిల్లికి సెక్యూరిటీ గార్డు జాబ్...!

ఇదెక్కడి విడ్డూరం...! పిల్లికి సెక్యూరిటీ గార్డు జాబ్...!

కాన్బెర్రా: కరోనా వైరస్ ప్రభావంతో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. కానీ ఇలాంటి సంక్షోభంలోనే ఓ పిల్లికి ఉద్యోగం లభించింది. ఆస్ట్రేలియాలోని ఎప్ వర్త్ ఆస్పత్రి బయట... గతేడాది నుంచి ఓ పిల్లి తిరుగుతుంది. ఆస్పత్రి ఆవరణలోనే ఉంటుంది. పిల్లి ఎప్పుడు అక్కడే ఉంటుండడంతో ఆస్పత్రి వారికి ఓ ఆలోచన వచ్చింది. దీంతో పిల్లికి సెక్యూరిటి గార్డు ఉద్యోగమిచ్చి దాని మెడలో ఓ ఐడీ కార్డు వేశారు. అందులో పిల్లి పేరు "ఎల్వుడ్ " అని రాసి ఉంది.

ఆస్పత్రిలోని పాథాలజీ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి ప్రకారం ఇప్పుడా పిల్లి ఆస్పత్రి బయట సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు లెక్క. దాని మెడలో ఐడీ కార్డు ఉంది కాబట్టి ఇప్పుడు ఆ పిల్లి ఆస్పత్రికి సంబంధించిన పిల్లి. అందువల్ల ఎవరూ దాని జోలికి వెళ్లరు. పిల్లి ముద్దుగా ఉండడంతో వచ్చిన రోగులను కూడా అది సంతోష పరుస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.logo