మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Sep 12, 2020 , 15:48:11

కొడుకు పేరు మర్చిపోయిన ఎలాన్‌ మస్క్‌!వీడియో వైరల్‌

కొడుకు పేరు మర్చిపోయిన ఎలాన్‌ మస్క్‌!వీడియో వైరల్‌

బెర్లిన్‌: ఎలాన్‌ మస్క్‌.. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు ఇది.  దక్షిణాఫ్రికాలో జన్మించిన కెనడియన్-అమెరికన్. ఇతను పెద్దవ్యాపారి, పెట్టుబడిదారు, ఇంజినీర్, ఆవిష్కర్త.  అయితే, ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కొడుకు పేరును మరిచిపోయారు. కాసేపయ్యాక తేరుకుని సమాధానమిచ్చారు. ఈ ఫన్నీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది.

మస్క్ ఇటీవల జర్మనీలో పర్యటించారు. జర్మనీ రాజధాని నగరంలోని టెస్లా తయారీ కర్మాగారమైన ‘గిగా బెర్లిన్’ను సందర్శించారు. అక్కడే విలేకరులతో మాట్లాడారు. ‘ఎక్స్‌ ఏఈ ఏ-12 ఎలా ఉన్నాడు.’ అని ఓ విలేకరి ప్రశ్నించగా, మస్క్‌ వాట్‌ అంటూ ఎదురు ప్రశ్నించాడు. కొద్ది సేపయ్యాక తేరుకుని ‘ఓహ్‌ నా కొడుకు గురించి అడుతున్నారా? చాలా బాగా ఉన్నాడు.’ అని సమాధానమిచ్చారు మస్క్‌.  ఈ వీడియోను గిగా బెర్లిన్‌ ప్లాంట్‌ అధికారిక యూట్యూబ్‌ పేజీలో పెట్టింది. ఈ వీడియోను పెద్ద సంఖ్యలో వీక్షించారు. మస్క్‌ కొడుకు పేరు ఓ పాస్‌వర్డ్‌లా ఉందంటూ చమత్కరించారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo