శనివారం 06 జూన్ 2020
International - Apr 25, 2020 , 01:28:42

బర్త్‌డే నాడే హ్యూమన్‌ ట్రయల్స్‌కు..

బర్త్‌డే నాడే హ్యూమన్‌ ట్రయల్స్‌కు..

లండన్‌: ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ మానవ ప్రయోగాలు ప్రారంభం అయ్యాయి. మొదట ఇద్దరు వలంటీర్లపై వ్యాక్సిన్‌ ప్రయోగించారు. వీరిద్దరూ శాస్త్రవేత్తలే కావడం విశేషం. మొదటి దశ హ్యూమన్‌ ట్రయల్స్‌ కోసం మొత్తం 800 మందిని ఎంపిక చేశారు. వారిలో మొదటి వ్యాక్సిన్‌ను స్వీకరించేందుకు ‘ఎలిసా గ్రనాటో’ అనే మైక్రోబయాలజీ శాస్త్రవేత్త  ముందుకొచ్చారు. ఈ మేరకు గురువారం ఆమెకు ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీలో వ్యాక్సిన్‌ను ఇంజెక్ట్‌ చేశారు. గురువారం ఆమె 32వ పుట్టిన రోజు కావడం మరో విశేషం. ఆమె ప్రస్తుతం ఎడ్వర్డ్‌ ఓ నెయిల్‌ అనే శాస్త్రవేత్తతో కలిసి క్యాన్సర్‌పై పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం వారిద్దరూ హ్యూమన్‌ ట్రయల్స్‌లో ఉన్నారు. 


logo