శనివారం 05 డిసెంబర్ 2020
International - Nov 12, 2020 , 13:47:32

ప‌ట్ట‌ప‌గ‌లే న‌డిరోడ్డుపై గ‌జ‌రాజు దొంగ‌త‌నం.. వీడియో వైర‌ల్‌

ప‌ట్ట‌ప‌గ‌లే న‌డిరోడ్డుపై గ‌జ‌రాజు దొంగ‌త‌నం.. వీడియో వైర‌ల్‌

గ‌జ‌రాజును చూస్తే గ‌జ‌గ‌జ వ‌ణ‌కాల్సిందే.. అలాంటి గ‌జ‌రాజు రోడ్డుకు అడ్డంగా నిల‌బ‌డితే వాహ‌న‌దారుల‌కు చెమ‌ట‌లు ప‌ట్ట‌క త‌ప్ప‌దు.. ఒళ్లంతా త‌డిసిపోవ‌డం ఖాయం. ఆహారం కోసం వెతుకుతున్న ఓ ఏనుగుకు.. అర‌టి పండ్లు కంట‌ప‌డ్డాయి. ఆ అర‌టి పండ్లు కూడా వాహ‌నంలో ఉన్నాయి. ఇక ఆక‌లితో ఉన్న ఆ ఏనుగు.. వాహ‌నానికి అడ్డంగా నిల‌బ‌డింది. వాహ‌నం ఆగిన వెంట‌నే డ్రైవ‌ర్ కిటికీలో నుంచి త‌న తొండాన్ని లోప‌లికి పెట్టి అర‌టి పండ్ల‌ను తీసుకునే ప్ర‌య‌త్నం చేసింది. దీంతో డ్రైవ‌ర్‌కు చెమ‌ట‌లు ప‌ట్టాయి. వాహ‌నంలోని ఓ వ్య‌క్తి అర‌టి పండ్ల‌ను దాని తొండంలో పెట్టేస‌రికి అది వెళ్లిపోయింది. ఈ త‌తంగాన్ని వాహ‌నంలోని కొంద‌రు చిత్రీక‌రించి వైర‌ల్ చేశారు. ఈ సంఘ‌ట‌న 2018లో శ్రీలంక‌లోని క‌ట‌రంగామా ఏరియాలో చోటు చేసుకోగా అప్పుడు వైర‌ల్ అయింది. మ‌ళ్లీ ఇప్పుడు ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప్ర‌వీణ్ క‌శ్వాన్ త‌న ట్విట్ట‌ర్ పేజీలో షేర్ చేశారు.