శనివారం 04 ఏప్రిల్ 2020
International - Feb 20, 2020 , 12:22:44

జ‌ర్మ‌నీలో కాల్పులు.. 8 మంది మృతి

జ‌ర్మ‌నీలో కాల్పులు.. 8 మంది మృతి

హైద‌రాబాద్‌:  జ‌ర్మ‌నీలోని హ‌నావు న‌గ‌రంలో కాల్పుల ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి.  రెండు ఘ‌ట‌న‌ల్లో ఎనిమిది మంది మ‌ర‌ణించారు. మ‌రో అయిదు మంది గాయ‌ప‌డ్డారు.  కాల్పులు జ‌రిపిన దుండ‌గులు ప‌రారీలో ఉన్నారు.  ఫ్రాంక్‌ఫ‌ర్ట్‌కు స‌మీపంలో ఉన్న హ‌నావు న‌గ‌రంలోని షిషా బార్స్‌లో తొలి ఘ‌ట‌న జ‌రిగింది. కాల్పులు జ‌రిపిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.  సిటీ సెంట‌ర్‌లోని బార్ వ‌ద్ద తొలిసారి కాల్పులు జ‌రిగాయి. న‌గ‌రంలోని కెస్స‌ల్‌డాట్ ప్రాంతంలో  రెండ‌వ సారి కాల్పులు జ‌రిగాయి. రెండు ప్రాంతాల్లోనూ పోలీసులు హెలికాప్ట‌ర్ల‌తో గాలిస్తున్నారు.  


logo