బుధవారం 27 మే 2020
International - Apr 22, 2020 , 18:14:50

అమెరికాకు ఈజిప్టు సాయం..

అమెరికాకు ఈజిప్టు సాయం..

వాషింగ్ట‌న్: అమెరికాలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుంది. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక కేసులు, మ‌ర‌ణాలు అక్క‌డ న‌మోద‌వుతున్నాయి. రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు సంభవిస్తున్నాయి. అగ్ర‌రాజ్యం ఇప్పుడు క‌రోనాతో విల‌విల్లాడుతోంది. ఈ క్ర‌మంలోఅమెరికా దేశానికి ఈజిప్టు త‌న‌వంతుగా సాయం అందించింది. మెడికల్ ఎక్విప్​మెంట్లను మిలిటరీ కార్గో విమానంలో పార్సిల్ చేసింది. ఇప్పటికే ఇటలీ, చైనా దేశాలకు మెడికల్ ఎక్విప్ మెంట్లను అందించిన ఈజిప్టు.. అమెరికాకు 2,00,000 మాస్కులు, 48,000 షూ కవర్లు, 20,000 సర్జికల్ క్యాప్​లతో పాటు.. ఇత‌ర‌ మెడికల్ సామాగ్రిని అందజేసింది. వైద్య కిట్స్‌తో వ‌చ్చిన‌ పార్శిల్ విమానం ల్యాండ్ అయిందని అమెరికా విదేశాంగ శాఖ వెల్ల‌డించింది. క‌ష్ట‌కాలంలో ఈజిప్టు సాయం అందించినందుకు  కైరోలోని అమెరికా రాయబారి  కృతజ్ఞతలు తెలిపారు.  అటు ఈజిప్టులోనూ కరోనా బాధితుల సంఖ్య 3,300 ఉండ‌గా, 250 మంది మ‌ర‌ణించారు.


logo