శనివారం 30 మే 2020
International - May 11, 2020 , 07:38:17

సంయోగం జరుగకుండానే గుడ్లు!

సంయోగం జరుగకుండానే గుడ్లు!

సిడ్నీ: సంయోగంలో పాల్గొనకపోయినప్పటికీ కేప్‌ తేనె టీగలు గుడ్లు పెట్టడానికి గల కారణాన్ని ‘యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ’ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. క్రోమోజోమ్‌ 11లో ఉన్న ఓ ప్రత్యేకమైన జన్యు పదార్థం కారణంగానే కేప్‌ తేనెటీగలు సంయోగంలో పాల్గొనకపోయినప్పటికీ గుడ్లను పెడుతున్నాయని వాళ్లు తెలిపారు. ఈ వివరాలు ‘కరెంట్‌ బయాలజీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ ప్రత్యేక జన్యు పదార్థాన్ని కనిపెట్టేందుకు 30 ఏండ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న బెంజమిన్‌ ఓల్డ్‌రాయిడ్‌ తెలిపారు. సంయోగంలో పాల్గొనకుండా కూలీ కేప్‌ తేనె టీగలు పెట్టే గుడ్లు ఫలదీకరణం అయ్యాక ఆడ తేనెటీగలే పుడుతాయని, మగవి జన్మించవని ఆయన పేర్కొన్నారు.


logo