బుధవారం 28 అక్టోబర్ 2020
International - Sep 30, 2020 , 21:59:20

గుడ్డుపై సుత్తి పడింది.. అయ్యో సుత్తి విరిగిపోయిందే!

గుడ్డుపై సుత్తి పడింది.. అయ్యో సుత్తి విరిగిపోయిందే!

ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యే కొన్ని వీడియోలు.. మనల్నికట్టిపడేస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలేమో.. మొదటి నుంచి చివరిదాకా ఆసాంతం చూసేలా ఉంటాయి. “వేచి ఉండండి, అక్కడ ఏమి జరుగుతున్నదో వీక్షించండి?” అన్న పెద్ద పెద్ద కాప్షన్లు మనల్ని కట్టిపడేస్తుంటాయి. 

అచ్చం అలాంటి వీడియో క్లిప్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది. టేబుల్‌పై నిలబెట్టిన కోడి గుడ్డుపై బలమైన సుత్తి పడింది. వీడియో ఊహించని మలుపుతో ముగుస్తుంది. సుత్తిపడితే గుడ్డు పగిలిపోవడం  ఖాయమని అనుకుంటున్న వారికి షాక్‌ ఇచ్చే ముగింపు పలుకడంతో వీడియో చూసిన వారంతా.. అయ్యో సుత్తి విరిగిపోయిందే! అని అనక మానరు. సాటిస్‌ఫయింగ్‌ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌ తన పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. నిజానికి ఈ వీడియోను ఇదివరకే ఫ్రాంకో మెలానియా తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజిలో పోస్ట్ చేశారు. ఇదే వీడియోను తిరిగి సాటిస్‌ఫయింగ్‌ అనే యూజర్‌ పోస్ట్‌ చేసి మరోసారి నెటిజెన్ల మనుసు దోచుకున్నారు.


View this post on Instagram

Unbreakable egg???????????? ???? @francomelanieh

A post shared by Satisfying Posts ???? (@satisfyingxtimes) on


logo