సోమవారం 01 జూన్ 2020
International - Apr 04, 2020 , 11:13:38

తీవ్ర మాంద్యంలో ఉన్నాం: ఇంట‌ర్నేష‌న‌ల్ మానిట‌రీ ఫండ్‌

 తీవ్ర మాంద్యంలో ఉన్నాం: ఇంట‌ర్నేష‌న‌ల్ మానిట‌రీ ఫండ్‌

హైద‌రాబాద్‌: ప్ర‌పంచ ఆర్థిక సంక్షోభం క‌న్నా దారుణ‌మైన మాంద్యంలో ఉన్నామ‌ని ఇంట‌ర్నేష‌న‌ల్ మానిట‌రీ ఫండ్ పేర్కొన్న‌ది.  కోవిడ్‌19 మ‌హమ్మారి నేప‌థ్యంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్థిక ప‌రిస్థితి అధ్వాన్నంగా ఉంద‌ని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైర‌క్ట‌ర్ క్రిస్ట‌లినా జార్జీవా తెలిపారు. అయితే వైర‌స్ వ‌ల్ల అత్యంత ప్ర‌భావానికి లోనైన‌వారి కోసం ట్రిలియ‌న్ డాల‌ర్ల‌ను ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు ఐఎంఎఫ్ చెప్పింది. శుక్ర‌వారం ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఐఎంఎఫ్ ఎండీ క్రిస్ట‌లినా మాట్లాడారు.  గ‌తంలో ఎన్న‌డూ ఇలాంటి సంక్షోభం రాలేద‌న్నారు. ఐఎంఎఫ్ చ‌రిత్ర‌లో ఎప్పుడూ ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ ఇంత‌లా స్తంభించ‌డం చూడ‌లేద‌ని ఆమె అన్నారు. మ‌నం ఇప్పుడు తీవ్ర మాంద్యంలో ఉన్నామ‌న్నారు.  ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఆదుకునేందుకు ట్రిలియ‌న్ డాల‌ర్ల నిల్వ‌ల‌ను వాడ‌నున్న‌ట్లు క్రిస్ట‌లినా తెలిపారు. ఎమ‌ర్జెన్సీ ఫండింగ్ ఇవ్వాల‌ని సుమారు 90 దేశాలు ఐఎంఎఫ్‌ను వేడుకున్నాయి. logo