బుధవారం 27 మే 2020
International - Apr 25, 2020 , 10:18:15

చిర‌కాలం గుర్తుండిపోయే ' సెల్ఫీ విత్ గెరిల్లా '

చిర‌కాలం గుర్తుండిపోయే ' సెల్ఫీ విత్ గెరిల్లా '

కాంగోలోని విరుంగ నేష‌న‌ల్ పార్కులో ఫారెస్ట్ గార్డులు దిగిన సెల్ఫీని ఖ‌చ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అంత‌రించిపోతున్న గెరిల్లా జాతుల‌ను కాపాడుతూ చాలా మంది ఫారెస్ట్ గార్డులు త‌మ ప్రాణాలు పణంగా పెట్టారు. గెరిల్లాల‌కు ఆవాసంగా ఉన్న విరుంగ నేష‌న‌ల్ పార్కులో శుక్ర‌వారం (ఏప్రిల్ 25) ఒక్క రోజే 13 ఎకో ఫారెస్ట్ గార్డులు వేట‌గాళ్ల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. 

గ‌త 20 ఏళ్ల‌లో 180 మందికిపైగా గార్డులు వేట‌గాళ్లను ప్ర‌తిఘ‌టిస్తూ వారి చేతిలో చ‌నిపోయారు. గెరిల్లాల‌తో ఇద్ద‌రు ఎకో ఫారెస్ట్ గార్డులు దిగిన ఫొటో..సెల్ఫీ ఆఫ్ సెంచ‌రీగా నిలుస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. విధులు నిర్వ‌ర్తిస్తూ గెరిల్లాల‌ను ర‌క్షించేందుకు ప్రాణాలు ప‌ణంగా పెడుతున్న గార్డుల‌కు సెల్యూట్ చేయాల్సిందే. ఈ సెల్ఫీని గుర్తు చేస్తూ ఐఎఫ్ఎస్ అధికారి ప‌ర్వీన్ కాస్వాన్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ పెట్టారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo