గురువారం 28 మే 2020
International - Apr 13, 2020 , 20:48:48

క‌రోనాకు తోడైన ఎబోలా...కాంగోలో ఇద్ద‌రి మృతి

క‌రోనాకు తోడైన ఎబోలా...కాంగోలో ఇద్ద‌రి మృతి

కాంగో: మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ చందంగా ఉన్న‌ది ప్ర‌పంచ ప్ర‌స్తుత ప‌రిస్థితి. క‌రోనాతో ప్ర‌పంచం స‌త‌మ‌త‌మ‌వుతుంటే..మ‌ళ్లీ ఇప్పుడు ఎబోలా ఆఫ్రికా దేశాల‌ను భ‌య‌పెడుతోంది. పోయింద‌నుకున్న ఎబోలా మ‌ళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే ఆఫ్రికాలోని కాంగోలో ఎబోలా వైరస్ సోకి ఇద్దరు మృతి చెందినట్లు స‌మాచారం. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ బెంబేలెత్తుతోంది. ఇక అంతమై పోయిందనుకున్న ఎబోలా కాంగోలో మ‌ళ్లీ కేసులు న‌మోదు కావ‌డంతో అక్క‌డి జ‌నం వ‌ణికిపోతున్నారు. గ‌త ఇరవై నెలలుగా ఎబోలా వైరస్ కేసులు లేకపోవడంతో ఇది అంతమైందని ఊపిరి పీల్చుకున్న‌ కాంగో మ‌ళ్లీ ఉలిక్కిప‌డింది. ఎబోలా మ‌హ‌మ్మారి ఇక లేన‌ట్టే అని WHO ప్ర‌క‌టించ‌డానికి సిద్ద‌మైన త‌రుణంలో... కాంగోలో బేణీ నగరంలో మళ్లీ ఎబోలా వైరస్‌తో ఇద్దరు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.  కాగా 2018 సంవత్సరం కాంగోలో ఎబోలా వైరస్ కారణంగా 2276 మంది ప్రాణాలు కోల్పోయారు.


logo