శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 13, 2020 , 01:09:17

నిరాడంబరంగా ఈస్టర్‌ వేడుకలు

నిరాడంబరంగా ఈస్టర్‌ వేడుకలు

వాటికన్‌సిటీ/రోమ్‌: ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఆదివారం ఈస్టర్‌ వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. సాధారణంగా ఈస్టర్‌రోజు క్రైస్తవ కుటుంబాలు చర్చిల్లో జరిగే సామూహిక ప్రార్థనలకు హాజరవుతాయి. కానీ, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి ఇంట్లో కొందరు స్నేహితుల మధ్య నిర్వహించుకున్నాయి. వాటికన్‌లోని ఖాళీగా ఉన్న సెయింట్‌ పీటర్‌ బసిలికాలోకి పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రవేశించి ప్రసంగించారు. ప్రస్తుత సంఘర్షణ పరిస్థితుల్లో తక్షణమే ప్రపంచవ్యాప్తంగా కాల్పుల విరమణ పాటించాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ పిలుపునిచ్చారు. 


logo