శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Jan 23, 2020 , 00:34:54

ప్రాచీన బిలం గుర్తింపు!

ప్రాచీన బిలం గుర్తింపు!

హ్యూస్టన్‌, జనవరి 22: పశ్చిమ ఆస్ట్రేలియాలో 70 కి.మీ. మేర విస్తరించి ఉన్న యెర్రబుబ్బ బిలమే భూమిపై అతి ప్రాచీన బిలమని శాస్త్రవేత్తలు గుర్తించారు. సుమారు 220 కోట్ల సంవత్సరాల కిందట ఒక ఉల్క ఆ ప్రాంతాన్ని ఢీకొని ఉండొచ్చని పేర్కొన్నారు. బిలంలోని లోహాలపై అధ్యయనం జరుపడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. యెర్రబుబ్బ బిలం ప్రాచీనమైనదని ఇదివరకే భావిస్తున్నప్పటికీ, దాని వయసును నిర్ధారించే ఆధారాలు లేవు. బిలంలోని మోంజోగ్రానైట్‌, జిర్కాన్‌ వంటి ప్రత్యేక లోహాలపై అధ్యయనం జరిపిన శాస్త్రవేత్తలు.. సుమారు 222.9 కోట్ల సంవత్సరాల కిందట (50 లక్షల ఏండ్లు అటుఇటుగా) ఆ ప్రాంతాన్ని ఉల్క ఢీకొన్నట్లు తాజాగా అంచనావేశారు. 


logo