ఆదివారం 29 నవంబర్ 2020
International - Oct 31, 2020 , 10:35:03

భారీ భూకంపం.. ట‌ర్కీ రెస్టారెంట్ ఇలా ఊగిపోయింది: వీడియో

భారీ భూకంపం.. ట‌ర్కీ రెస్టారెంట్ ఇలా ఊగిపోయింది:  వీడియో

హైద‌రాబాద్‌:  ట‌ర్కీలోని ఇజ్‌మిర్ న‌గ‌రంలో భారీ భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై భూకంప తీవ్ర‌త 7గా న‌మోదు అయ్యింది.  భూకంపం ధాటికి ఆ న‌గ‌రంలో సుమారు 20 బిల్డింగ్‌లు నేల‌మ‌ట్టం అయ్యాయి.  ఏజియ‌న్ స‌ముద్రం వ‌ద్ద సుమారు 300 సార్లు ప్ర‌కంప‌న‌లు చోటుచేసుకున్నాయి. శుక్ర‌వారం వ‌చ్చిన ఈ భూకంపం వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు 26 మంది మృతిచెందారు.  గ్రీసులోని సామోస్ దీవుల్లోనూ భూ ప్ర‌కంప‌న‌లు న‌మోదు అయ్యాయి. అయితే ఐజ్‌మిర్ న‌గ‌రంలోని ఓ రెస్టాంట్‌లో సుమారు నిమిషం పాటు ఊగిపోయింది.  దానికి సంబంధించిన వీడియో ఇది. రెస్టారెంట్‌లో మ‌హిళ‌లు ప‌నిచేస్తున్న స‌మ‌యంలో భారీ భూకంపం వ‌చ్చింది.  రెస్టారెంట్ కిచెన్‌లో ఉన్న ఓ వీడియో ఇప్పుడు అంద‌ర్నీ భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తోంది.  నిమిషంపైగా బిల్డింగ్ ఊగిపోయింది. ప‌నిచేస్తున్న ఉద్యోగులు ప్రాణాల‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నం చేశారు. భూకంపం వ‌ల్ల సుమారు వెయ్యి మంది వ‌ర‌కు గాయ‌ప‌డ్డారు.  

ఇక మ‌రో వీడియోలో ఓ బిల్డింగ్ కూలిన ఘ‌ట‌న చూడ‌వ‌చ్చు.  ఇజ్‌మిర్ న‌గ‌రంలోనే ఆ బిల్డింగ్ కూలింది.  స్థానికుడు ఒక‌రు త‌న మొబైల్‌లో ఆ వీడియోను బంధించాడు.  ప్రాణ భ‌యంతో రోడ్డు మీద‌కు వ‌చ్చిన వారు.. ఊగిపోతున్న బిల్డింగ్‌ను చూసి వీడియో తీశారు. అయితే అంత‌లోనే  అంద‌రి ముందు ఆ బిల్డింగ్ శిథిల‌మైంది.  


\