సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Sep 07, 2020 , 15:18:07

ఇరాన్‌లో కంపించిన భూమి.. 34 మందికి గాయాలు

ఇరాన్‌లో కంపించిన భూమి.. 34 మందికి గాయాలు

టెహ్రాన్ : ఇరాన్‌లోని గోలెస్తాన్ ప్రావిన్స్‌లో సోమవారం 5.1 తీవ్ర‌త‌తో భూకంపం సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌రుగ‌క‌పోగా.. 34 మంది గాయ‌ప‌డ్డారు. భూకంపం వల్ల ఈ ప్రాంతంలో సుమారు 50 ఇండ్ల‌కు నష్టం వాటిల్లిందని రామియన్ గవర్నర్ హమీద్ రెజా చూబ్దారీ పేర్కొన్నారు. 9.0 కిలోమీటర్ల లోతుతో 37.021 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 55.101 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద భూకంపం సంభవించింద‌ని ఇరాన్ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo