శుక్రవారం 04 డిసెంబర్ 2020
International - Oct 30, 2020 , 19:45:50

వీధుల్లోకి చొచ్చుకొచ్చిన సముద్రం

 వీధుల్లోకి చొచ్చుకొచ్చిన సముద్రం

టర్కీ : ఏజియన్‌ సముద్రంలో భూ కంపం ధాటికి టర్కీ, గ్రీస్‌ రాజధాని నగరాలు ఇస్తాంబుల్‌, ఏథెన్స్‌తోపాటు టర్కీష్‌ నగరం ఇజ్మిర్‌ నగరాలు వణికిపోయాయి. ఇజ్మిర్‌లో 20పైగా బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సముద్రంలో స్వల్ప సునామీ సంభవించిన కారణంగా నగరంలో పలు వీధుల్లోకి సముద్రపు అలలు చొచ్చుకొచ్చాయి.  సముద్రపు అలలు చొచ్చుకురావడం తీవ్ర సునామీకి హెచ్చరికగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు అధికారికంగా సునామీ హెచ్చరికలేవీ జారీ చేయలేదు. ఏజియన్‌ సముద్ర తీర నగరాలకు భూకంపాలు పరిపాటి, గతంలోనూ భారీ భూకంపాలు కుదిపేశాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


తాజావార్తలు