శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
International - Jul 07, 2020 , 08:29:32

ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియాలో భూకంపం

హైద‌రాబాద్‌: ఇండోనేషియాలో భూకంపం సంభ‌వించింది. ఇండోనేషియా ప్రధాన ద్వీపం జావా తీరంలో భూమి కంపించింది. ఈ భూకంపం సముద్ర గర్భంలో సెమ‌రంగ్‌కు 142 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకతమై ఉన్న‌ద‌ని ఇండోనేషియా వాతావరణ, జియోఫిజిక్స్ అధికారులు చెప్పారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3 గా నమోదైంది. ఈ భూకంపంవల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని ఇండోనేషియా అధికారులు చెప్పారు. భూకంపంవల్ల సునామీ వచ్చే ప్రమాదం కూడా లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. 

2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన భూకంపం, అగ్నిపర్వత విస్పోటనం వల్ల సునామీ వ‌చ్చింది. ఆ సునామీ ధాటికి 12 దేశాల్లో 2,30,000 మందికిపైగా మరణించారు. ఇక అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ వద్ద కూడా మంగళవారం తెల్లవారుజామున 1.33 గంటలకు భూమి కంపించింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఇటీవ‌ల త‌ర‌చూ భూప్రకంపనలు చోటుచేసుకుంటుడం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo