సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Jul 23, 2020 , 09:01:46

టిబెట్‌లో 6.2 తీవ్ర‌త‌తో భూకంపం

టిబెట్‌లో 6.2 తీవ్ర‌త‌తో భూకంపం

జిజాంగ్‌: ద‌క్షిణ టిబెట్ ప‌రిధిలోని జిజాంగ్ ప్రాంతంలో భూకంపం సంభ‌వించింది. గురువారం తెల్ల‌వారుజామున 1.37 గంట‌ల‌కు సంభ‌వించిన ఈ భూకంపం తీవ్ర‌తం రిక్ట‌ర్ స్కేల్‌పై 6.2గా న‌మోద‌య్యింద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సీస్మోల‌జీ ప్ర‌క‌టించింది. భూకంప కేంద్రం నేపాల్ రాజ‌ధాని ఖ‌ట్మండూకు ఉత్త‌రాన 380 మైళ్ల దూరంలో ఉన్న‌ద‌ని తెలిపింది.  ఈ భూకంపం వ‌ల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని అధికారులు తెలిపారు. 


logo