బుధవారం 03 మార్చి 2021
International - Jan 24, 2021 , 07:10:57

అంటార్కిటికా దీవుల్లో భూకంపం..

అంటార్కిటికా దీవుల్లో భూకంపం..

చీలి : అంటార్కిటికాలో శనివారం వరుసగా రెండు సార్లు భూ ప్రంకపనలు వచ్చాయి. దీంతో చిలీలోని ఎడ్వర్డో ఫ్రీ బేస్ వద్ద సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మొదట చిలీ అంటార్కిటిక్ బేస్ సమీపంలో ప్రకంపనలు సంభవించాయి. ఈ ప్రాంతాన్ని సౌత్ సెలాండ్ దీవులు అని కూడా పిలుస్తారు. అయితే ప్రకంపనలతో ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఎలాంటి సమాచారం తెలియలేదు. రాత్రి 8.36 గంటల ప్రాంతంలో రిక్టర్‌ స్కేలుపై 7.1తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. భూకంప కేందాన్ని చీలికి ఈశాన్యంలో 216 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి తెలిపారు. ప్రకంపనలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతానికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలో రాత్రి 9.07 గంటల ప్రాంతంలో చీలి - అర్జెంటీనా సరిహద్దులో 5.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. శాంటియాగో నుంచి 133 కిలోమీటర్ల దూరంలో, 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు జీఎఫ్‌జడ్‌ జర్మన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ జియోసైన్సెస్‌ పేర్కొంది. 

VIDEOS

logo