శనివారం 24 అక్టోబర్ 2020
International - Sep 24, 2020 , 07:47:10

పాక్‌, ఆఫ్ఘ‌నిస్థాన్‌లలో భూకంపం

పాక్‌, ఆఫ్ఘ‌నిస్థాన్‌లలో భూకంపం

ఇస్లామాబాద్: పొరుగుదేశాలైన‌ పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. పాక్ రాజ‌ధాని ఇస్లామాబాద్ స‌మీపంలో  ఉదయం 5.46 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్ర‌త‌ రిక్టర్ స్కేలుపై 4.3గా న‌మోద‌య్యింద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మోలజీ చెప్పారు. ఇస్లామాబాద్‌కు పశ్చిమాన 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంద‌ని వెల్ల‌డించింది. 

ఇక ఆఫ్ఘనిస్థాన్ రాజ‌ధానికి కాబూల్ నగరానికి ఈశాన్యంలోని 237 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. ఈరోజు ఉద‌యం 5.33 గంటలకు భూకంపం సంభవించింద‌ని, దీని తీవ్ర‌త 4.2గా నమోదైందని వెల్ల‌డించింది.


logo